Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

అజంజాహి మిల్లు భూముల వేలాన్ని అడ్డుకుంటాం: కార్మికులు

Author Neti Sudiksha | 25 Jun 2026, 04:30 PM | వరంగల్
అజంజాహి మిల్లు భూముల వేలాన్ని అడ్డుకుంటాం: కార్మికులు

వరంగల్, జూన్ 25 (సుదీక్ష న్యూస్):
అజంజాహి మిల్లు భూములను ప్రభుత్వం వేలం వేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శుక్రవారం జరిగే వేలంపాటలను అడ్డుకుంటామని మాడిఫైడ్ వాలంటరీ రిటైర్మెంట్–2002 వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు.

గురువారం అజంజాహి మిల్లు వాటర్ ట్యాంక్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు కొమ్ము సందీప్, ప్రధాన కార్యదర్శి బస్కుల ఈశ్వర్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 318 మంది కార్మికులకు భూములు కేటాయించకుండా ప్రభుత్వం వేలం నిర్వహించడం అన్యాయమన్నారు. ఈ వేలాన్ని రద్దు చేయాలని, కార్మికులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐఎఫ్‌టీయూ, తెలంగాణ ప్రజాఫ్రంట్, ఏపీసీఎల్‌సీ నాయకులు పాల్గొన్నారు.