Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

‘నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను’..

Author Neti Sudiksha | 26 Jun 2026, 12:19 PM | Cinema
‘నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను’..

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో తరచూ పలు వార్తలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఆమె రిలేషన్‌షిప్ గురించి గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారాలపై స్వయంగా శృతి హాసన్ స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్‌కు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని ప్రస్తుతం మీరు ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అని ప్రశ్నించగా, శృతి ఎలాంటి సందేహాలకు తావులేకుండా సమాధానం ఇచ్చారు.నేను ప్రస్తుతం ఎవరితోనూ, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేను అని శృతి హాసన్ స్పష్టం చేశారు. దీంతో ఆమె డేటింగ్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.
అలాగే మరో అభిమాని, నటిగా కాకపోతే ఏ వృత్తిని ఎంచుకునేవారని అడగగా, చిన్నపిల్లల మానసిక వైద్యురాలిగా (చైల్డ్ సైకాలజిస్ట్) మారాలనుకునేదానిని అని శృతి తెలిపారు. ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒకప్పుడు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శృతి హాసన్ గత కొంతకాలంగా సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తక్కువ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ, తన అభిమానులతో మాత్రం సోషల్ మీడియా ద్వారా నిరంతరం టచ్‌లో ఉంటున్నారు.