Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

అయోధ్య రామమందిర విరాళాల వివాదం లో కీలక మలుపు..

Author Neti Sudiksha | 26 Jun 2026, 01:16 PM | NATIONAL
అయోధ్య రామమందిర విరాళాల వివాదం లో కీలక మలుపు..

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను గురువారం రాత్రి అయోధ్యలోనే అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు.
ఈ నెల ప్రారంభంలో విరాళాల నిధుల మళ్లింపు ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వీటిని తోసిపుచ్చారు. అయితే, వివాదం ముదరడంతో ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు యూపీ ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. జూన్ 23న SIT తన ప్రాథమిక నివేదికను సమర్పించిన రెండు రోజులకే ఈ అరెస్టులు జరిగాయి.