Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు మృతి.

Author Neti Sudiksha | 26 Jun 2026, 01:31 PM | INTERNATIONAL
ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు మృతి.

ఝార్ఖండ్‌లోఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన రాజ్‌రప్ప పోలీస్‌ పరిధిలోని రామ్‌గఢ్-బొకారో రోడ్డుపై అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాడ్రుడిని రామ్‌గఢ్ సదర్ హాస్పిటల్‌కు తరలించారు.
అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతులంతా పెళ్లి కార్యక్రమాల్లో బ్యాండ్ వాయించే వారని, హజారీబాగ్ జిల్లా బల్సాగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.