Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పన్నూరులో విషాదం.. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య..

Author Neti Sudiksha | 27 Jun 2026, 09:26 PM | కరీంనగర్
పన్నూరులో విషాదం.. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య..

రామగిరి మండలం పన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్‌పల్లి ఫ్లాట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొగిలి సాయి (26) శనివారం సాయంత్రం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే సాయి ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.
స్థానికుల కథనం ప్రకారం.. ఏడు సంవత్సరాల క్రితం గోదావరిఖనికి చెందిన యువతిని మొగిలి సాయి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. గొడవలతో విసిగిపోయిన సాయి శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.