Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పంజా విసిరిన స్మిత్, రూర్కీ..

Author Neti Sudiksha | 27 Jun 2026, 09:37 PM | Sports
 పంజా విసిరిన స్మిత్, రూర్కీ..

నాటింగ్‌హమ్ టెస్టులో ఇంగ్లండ్(England) పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. ఓపెనర్ బెన్ డకెట్(113) శతకంతో భారీ స్కోర్‌కు బాటలు వేసినా న్యూజిలాండ్ పేసర్లు నాథన్ స్మిత్‌(4-91), జకారీ ఫౌల్క్స్‌(3-35) లు నిప్పులు చెరగడంతో మిడిలార్డర్ బ్యాటర్లు నిరాశపరిచారు. విలియం ఓ రూర్కీ(3-53) ధాటికి తొలి సెషన్‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 354కే ఆలౌటైంది. కివీస్‌కు 84 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
స్వదేశంలో టెస్టు సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడిన ఇంగ్లండ్‌ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారీ స్కోర్ చేయకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుకున్నారు‌.