Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఆఫ్ఘనిస్థాన్‌లో 6.2 తీవ్రతతో భూకంపం..

Author Neti Sudiksha | 27 Jun 2026, 09:47 PM | NATIONAL
 ఆఫ్ఘనిస్థాన్‌లో 6.2 తీవ్రతతో భూకంపం..

ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. (earthquake) భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:04 గంటలకు ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. కలాఫ్‌గాన్‌కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు పాకిస్థాన్‌, భారత్‌, చైనా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌లో భూ ప్రకంపకనలు నమోదయ్యాయి.
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం కారణంగా, శనివారం సాయంత్రం ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌తో పాటు ఉత్తర భారత రాష్ట్రాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నదని, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే ‘నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ’ వెల్లడించింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియలేదు.