Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి

Author Neti Sudiksha | 27 Jun 2026, 09:55 PM | Array
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని సీఐటీయూ నల్ల‌గొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను సీఐటీయూ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.డి.సలీం స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ప్రభుత్వ రంగంలో నిర్మించబడిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఇలాంటి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో, కార్మికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.