Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఏపీ ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్

Author Neti Sudiksha | 27 Jun 2026, 10:27 PM | ANDHRA PRADESH
ఏపీ ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిర్‌పోర్టుల్లో బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి ఎయిర్‌పోర్టు మినహా అన్ని ఎయిర్‌పోర్టులకు బార్ లైసెన్స్‌లు వర్తించనున్నాయి. అయితే, ఎయిర్‌పోర్టు ఆపరేటర్ సిఫారసు ఉంటేనే బార్ లైసెన్స్ మంజూరు అవుతుంది. బార్ లైసెన్స్ దరఖాస్తుకు 5 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుల రద్దీ 20 లక్షలకు పైగా ఉన్న ఎయిర్‌పోర్టులకు వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ 25 లక్షలు రూపాయలు ఉండనుంది.
ప్రయాణికుల రద్దీ 20 లక్షలలోపు ఉన్న ఎయిర్‌పోర్టులకు వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ 15 లక్షలు రూపాయలు ఉంటుంది. ఆ ట్యాక్స్‌ను ఒకేసారి లేదా 6 సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉండనుంది. ఎయిర్‌పోర్టు బార్లను 24 గంటలపాటు నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుంది. భద్రత, ఎయిర్‌పోర్టు ఆపరేషనల్ నిబంధనలకు లోబడి 24x7 సేవలు ఉండనున్నాయి. బార్ లైసెన్స్ నిబంధనల్లో సవరణలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.