Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ముంబైలో భారీ కుట్ర భగ్నం.

Author Neti Sudiksha | 27 Jun 2026, 10:41 PM | NATIONAL
ముంబైలో భారీ కుట్ర భగ్నం.

ముంబై పోలీసులు తాజాగా భారీ కుట్రను భగ్నం చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలుకల మందు నింపిన విషపు గుళికలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 14,900 విషపు గుళికలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఫయాజ్ ప్రేమ్‌జీగా గుర్తించారు. అతడు పుణెలోని విమాన్ నగర్ ప్రాంతంలో ఉంటున్నాడని చెప్పారు. పెయింట్ షాపు నిర్వహిస్తాడని తెలిపారు.

నిందితుడు కొన్ని రోజులుగా ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలోని ఒక డార్మిటరీలో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. జేజే, బైకుల్లా ప్రాంతాల మీదుగా మొహర్రం ఊరేగింపు వెళుతున్న సమయంలో నిందితుడు అక్కడున్న వారికి విషపు గుళికలను పంచే ప్రయత్నం చేసే సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.