Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

'అయోధ్య ట్రైలర్ మాత్రమే.. కాశీ, మథుర దోపిడీపై భయమేస్తోంది'..

Author Neti Sudiksha | 05 Jul 2026, 07:44 PM | NATIONAL
'అయోధ్య ట్రైలర్ మాత్రమే.. కాశీ, మథుర దోపిడీపై భయమేస్తోంది'..

అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలోని దాదర్‌లో నిర్వహించిన 'రామరక్ష' ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులతో కలిసి హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
'అయోధ్య అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. కాశీ, మథుర కడతాం అని కొందరు చెబుతున్నారు. కానీ అయోధ్యలోనే ఇంత పెద్ద ఎత్తున విరాళాల దోపిడీ జరిగితే.. రేపు కాశీ, మథురలో జరిగే దోపిడీ గురించి నాకు భయమేస్తోంది' అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. హిందువులను దోచుకునేవారే ఇప్పుడు అధికారంలో ఉండటం దురదృష్టకరమన్నారు.