Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ప్రణయన్న ఆశయ సాధనలో ముందుకెళ్తున్నాం: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్

Author Neti Sudiksha | 06 Jul 2026, 05:53 PM | హన్మకొండ
ప్రణయన్న ఆశయ సాధనలో ముందుకెళ్తున్నాం: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ ,జూలై 6 (సుదీక్ష న్యూస్) : మాజీ మంత్రివర్యులు దివంగత దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి జయంతి–వర్ధంతి సందర్భంగా సోమవారం వరంగల్‌లోని పద్మాక్షి గుట్ట లెప్రసీ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా దాస్యం ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు “ప్రణయ్ భాస్కర్ అమర్ రహే”, “ప్రణయన్న జోహార్లు” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, దాస్యం ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధన కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఓరుగల్లు ప్రజల హృదయాల్లో ప్రణయన్నకు ప్రత్యేక స్థానం ఉందని, పేద ప్రజల సంక్షేమమే ఆయన జీవిత ధ్యేయమని అన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ధైర్యంగా వినిపించిన నిజమైన తెలంగాణ వాది ప్రణయ్ భాస్కర్ అని కొనియాడారు.
నాటి హనుమకొండ నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రజానాయకుడిగా సేవలందించిన నాయకుడు ప్రణయ్ భాస్కర్ అని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు.
అనంతరం లెప్రసీ కాలనీ వాసులకు పండ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఉడతల సారంగపాణి, నాయకులు ఖలీల్, రఘు, హైమావతి, వరుణ్, సారంగం, అనిల్, ఖాజా, సందీప్, నందా కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.