Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసు: నివేదిక లోక్‌సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం

Author Neti Sudiksha | 07 Jul 2026, 12:01 PM | NATIONAL
మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసు: నివేదిక లోక్‌సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం

న్యూఢిల్లీ, జులై 7: అవినీతి ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కమిటీ రూపొందించిన నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. అయితే, అప్పటికే రాజీనామా చేసిన న్యాయమూర్తిపై పార్లమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోగలదనే అంశంపై ఇప్పుడు సరికొత్త రాజ్యాంగపరమైన చర్చ తెరపైకి వచ్చింది.గతంలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో లెక్కల్లో చూపని నగదు కట్టలు దహనమైన వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ఒత్తిడికి గురైన ఆయన, ఏప్రిల్ 9వ తేదీన తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.