Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

Author Neti Sudiksha | 07 Jul 2026, 12:03 PM | ANDHRA PRADESH
జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

విజయవాడ, జులై 7: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దివంగత సీఎం జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిరం పేరుతో బీజేపీ వేల కోట్లు వసూలు చేసి అవినీతికి పాల్పడిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉందని తెలిసి కూడా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. వేలాది మంది చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోతుంటే భారత విదేశాంగ విధానం స్పందించకపోవడం దారుణమని, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా మోడీ విదేశీ శక్తుల చేతిలో ఇరుక్కుపోయారని విమర్శించారు.

చింతా మోహన్ మాట్లాడుతూ.. ‘ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వైఎస్ జగన్‌పై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దివంగత సీఎం జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా?. రాజకీయ ఒత్తిళ్లకు కోర్టులు లొంగుతున్నాయనే అనుమానం ప్రజల్లో రాకుండా న్యాయస్థానాలే చొరవ తీసుకుని జగన్ కేసులను విచారించాలి. రావణ్ తెలిసో తెలియకో నోరు జారి ఉండవచ్చని, ప్రభుత్వం ఈ విషయంలో కొంత విశాల హృదయంతో ఆలోచించాలి’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి