Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

బీఎల్‌వోలను ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు: రాంచందర్‌రావు

Author Neti Sudiksha | 07 Jul 2026, 04:37 PM | TELANGANA
బీఎల్‌వోలను ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు: రాంచందర్‌రావు

హైదరాబాద్, జులై 7: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని(CEO) ఆ పార్టీ బృందం కలిసింది. ఈ సందర్భంగా SIR విషయంలో ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని రాంచందర్ రావు ఫిర్యాదు చేశారు. SIR ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు. అనంతరం బీజేపీ తెలంగాణ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ప్రాంతాల్లో బీఎల్‌వో(BLO)లను ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంటింటికీ వెళ్లకుండా బీఎల్‌ఓలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

పలువురు ఓటర్లకు ఫారాలు అందడం లేదని రాంచందర్ రావు తెలిపారు. తెలుగు ఫారాలతో ఇతర రాష్ట్రాల ఓటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. హైదరాబాదే కాకుండా అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఇంగ్లీషు ఫారాలు అందించాలని కోరినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా లోపాలపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరినట్లు రాంచందర్‌రావు పేర్కొన్నారు

ఇవి కూడా చదవండి