Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్: ఏఐఎఫ్‌డీఎస్ పిలుపు

Author Neti Sudiksha | 08 Jul 2026, 03:37 PM | TELANGANA
జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్: ఏఐఎఫ్‌డీఎస్ పిలుపు

హన్మకొండ, జూలై 8 (సుదీక్ష న్యూస్): రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున తెలిపారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, హాస్టళ్ల సమస్యల పరిష్కారం, స్కాలర్‌షిప్‌లు–ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ, విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణ తదితర డిమాండ్లతో ఈ బంద్ చేపడుతున్నట్లు చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు బంద్‌కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.