Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వం

Author Neti Sudiksha | 11 Jul 2026, 01:08 PM | ANDHRA PRADESH
జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వం

సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వమని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తర్వాత బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని విమర్శించారు. టీడీపీ నేతలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, ఏదో ఒక అరాచకం జరిగేలా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ రెచ్చిపోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. అనంతపురంలో జరిగిన ఘటనలాంటి సంఘటనల వెనుక కూడా ప్రత్యర్థుల ప్రేరేపణ, ఉచ్చు పన్నే ప్రయత్నాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఇలాంటి చర్యలు సైకో మనస్తత్వానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బెయిల్‌పై బయటకు వచ్చి ఆరుగురిని హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, నేర మనస్తత్వం ఎంత ప్రమాదకరమో వివరించారు. జగన్ కూడా అలాంటి నేర మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. తనకు సహకరించని వారిపై దాడి చేయడం, వారిని లక్ష్యంగా చేసుకోవడం ఆయన తీరుగా మారిందని విమర్శించారు.