Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కిడ్నీ బాధితులు బీట్‌రూట్ తినొచ్చా?

Author Neti Sudiksha | 11 Jul 2026, 01:14 PM | HEALTH
కిడ్నీ బాధితులు బీట్‌రూట్ తినొచ్చా?

మధుమేహం, అధిక రక్తపోటు, మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బీట్‌రూట్ కిడ్నీ రోగులకు మంచిదా? లేక హానికరమా? అనే సందేహానికి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
కిడ్నీ బాధితులు బీట్‌రూట్ తినొచ్చా?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (NIDDK) ప్రకారం.. కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. బీట్‌రూట్ కూడా అలాంటి ఆహారాల్లో ఒకటి. అయితే, కిడ్నీ బాధితులు బీట్‌రూట్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల సమస్య లేకపోతే.. వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు పరిమిత మోతాదులో బీట్‌రూట్ తీసుకోవచ్చు. అంటే, బీట్‌రూట్ తినాలా వద్దా అనేది మీకు ఉన్న కిడ్నీ సమస్య రకాన్ని బట్టి నిర్ణయించాలి. వైద్యుల సలహా లేకుండా ఆహారంలో పెద్ద మార్పులు చేయకపోవడం మంచిది.