Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

NEET-2026 ఫలితాల్లో మరోసారి అగ్రగామిగా రెసో మెడికాన్ విద్యార్థుల అద్భుత ప్రతిభకు సంస్థ యాజమాన్యం హర్షం

Author Neti Sudiksha | 17 Jul 2026, 09:52 PM | హన్మకొండ
NEET-2026 ఫలితాల్లో మరోసారి అగ్రగామిగా రెసో మెడికాన్ విద్యార్థుల అద్భుత ప్రతిభకు సంస్థ యాజమాన్యం హర్షం

హనుమకొండ, జూలై 17 (సుదీక్ష న్యూస్) : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)-2026 ఫలితాల్లో హనుమకొండలోని రెసో మెడికాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ లెక్కల రాజిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సంస్థ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ఫ్రీ మెడికల్ సీట్లకు అర్హత సాధించే స్థాయిలో మార్కులు పొందారని తెలిపారు.
ఈ ఏడాది నీట్ పరీక్షలో కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు విశేష మార్కులు సాధించి ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు పొందే అవకాశాలను మెరుగుపరుచుకున్నారు.
అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు:
కే. శ్యాంకరన్ – 655 మార్కులు
పి. గురురాజ్ రెడ్డి – 630 మార్కులు
బి. కోమల్ – 591 మార్కులు
బి. అభిషేక్ – 580 మార్కులు
సి.హెచ్. సాక్షి – 546 మార్కులు
మహమ్మద్ అద్నాన్ – 528 మార్కులు
ఎన్. మణిదీప్ – 528 మార్కులు
వేముల జశ్విన్ తేజ్ – 500 మార్కులు
ఈ సందర్భంగా ఛైర్మన్ లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ, వరంగల్–హనుమకొండ జిల్లాల్లోనే అత్యాధునిక వసతులతో ప్రత్యేకంగా Bi.P.C. + NEET కోచింగ్ క్యాంపస్ ఏర్పాటు చేసి, జాతీయ స్థాయి అనుభవం కలిగిన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణలో శిక్షణ అందించడం వల్లే ప్రతి సంవత్సరం ఈ స్థాయి విజయాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రెసో మెడికాన్ మేనేజింగ్ డైరెక్టర్ దీప్తిరావు మాట్లాడుతూ, ఈ ఏడాది మరో 56 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించి ఫ్రీ మెడికల్ సీట్లు పొందే అవకాశాలను మెరుగుపరుచుకున్నారని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులకు సంస్థ యాజమాన్యం అభినందనలు తెలిపింది.
ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో మేనేజింగ్ డైరెక్టర్ దీప్తిరావు,డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఈఓ లెక్కల రమ్యా రాజిరెడ్డి, ప్రిన్సిపల్, అధ్యాపకులు, ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.