Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నటి నుంచి వ్యాపారవేత్తగా సాక్షి అగర్వాల్..

Author Neti Sudiksha | 21 Jul 2026, 11:22 AM | Cinema
 నటి నుంచి వ్యాపారవేత్తగా సాక్షి అగర్వాల్..

దక్షిణాది సినీ నటి సాక్షి అగర్వాల్ తన జీవితంలో మరో కీలక అడుగు వేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తన చిరకాల కలను నిజం చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘ఓకూ (OKU)’ పేరుతో ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని అధికారికంగా ప్రారంభించారు. కొత్త సంస్థ ప్రారంభం సందర్భంగా సాక్షి అగర్వాల్ భావోద్వేగంగా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను గత ఐదేళ్లుగా నిరంతరం పరిశోధనలు నిర్వహిస్తూ, ఉత్పత్తుల నాణ్యత, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ప్రజల అంచనాలకు తగ్గట్టుగా అత్యుత్తమ నాణ్యత కలిగిన పోషకాహార ఉత్పత్తులను రూపొందించడమే నా లక్ష్యం. ప్రతి ఉత్పత్తి విషయంలో నాణ్యతకు ఎలాంటి రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో పనిచేశాను అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక న్యూట్రిషన్ ఉత్పత్తులకు సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని, అయితే తాను ప్రారంభించిన సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఎంతో గర్వంగా ఉందని సాక్షి తెలిపారు. సినిమా షూటింగ్‌లతో పాటు ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ ఈ సంస్థను నిర్మించానని, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే నాణ్యమైన ఉత్పత్తులను ప్రజలకు అందించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.