Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తుపాకులతో బెదిరించి, కరీంనగర్‌లో భారీ దోపిడీ.. 66 తులాల బంగారం, 21లక్షల క్యాష్ చోరీ.. ఇంటి అల్లుడిపైనే అనుమానాలు!

Author Neti Sudiksha | 22 Jul 2026, 11:15 AM | TELANGANA, కరీంనగర్
తుపాకులతో బెదిరించి, కరీంనగర్‌లో భారీ దోపిడీ.. 66 తులాల బంగారం, 21లక్షల క్యాష్ చోరీ.. ఇంటి అల్లుడిపైనే అనుమానాలు!

కరీంనగర్ పట్టణంలో మరోసారి దోపిడీ కలకలం రేపింది. పీఎంజే జ్యువెల్లరీ షాపులో దోపిడీ ఘటన జరిగిన రెండు నెలలు గడవకముందే, అదే తరహాలో మరో ఇంట్లో దోపిడీ జరిగింది. భగత్ నగర్‌కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి అర్ధరాత్రి 12 గంటల తర్వాత చొరబడిన దుండగులు.. 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు.

అజ్మత్ అలీ కుటుంబం భగత్ సింగ్ చౌరస్తాలోని ఓ ఇంట్లో మొదటి అంతస్తులో నివాసం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు అజ్మత్ అలీ గ్రౌండ్ ఫ్లోర్‌లోని లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తుండగా.. బయట మాటువేసిన ఎనిమిది మంది దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. అరవకుండా నోరు మూసేసి, బలవంతంగా ఇంట్లోకి వెళ్లారు. అనంతరం తల, ముఖంపై గట్టిగా కొట్టారు. ఇంట్లో ఉన్న అతని భార్య, ఇద్దరు కుమార్తెలను సైతం తీవ్రంగా కొట్టారు. అరిస్తే చంపేస్తామని తుపాకులు, కత్తులతో బెదిరించారు.