Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన..

Author Neti Sudiksha | 23 Jul 2026, 01:39 PM | హైదరాబాద్
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన..

హైదరాబాద్ లోని లక్డీ కా పూల్ లో ఉన్న తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ విధులలో ఉన్న స్వామి అనే పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఆత్మహత్య ఘటన మొన్నటికి మొన్న త్రిపుర డిజిపి అనురాగ్ ధన్కర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరచిపోకముందే తెలంగాణ డీజీపీ కార్యాలయంలో మరొక ఆత్మహత్య ఘటన చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. ఈ ఘటన వివరాలలోకి వెళితే తెలంగాణా డీజీపీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న స్వామి అనే కానిస్టేబుల్ నిన్న రాత్రి విధులు నిర్వర్తించారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వాష్ రూమ్ కి వెళ్ళాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్ స్వామి తనతో తీసుకు వెళ్లిన సర్వీస్ రివాల్వర్ తో తనను తానే కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శబ్దం విని వెంటనే స్పందించిన తోటి సిబ్బంది వాష్‌రూమ్‌కి వెళ్లేసరికి స్వామి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం స్వామి కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.