Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

దేశంలోనే తొలిగా తెలంగాణాలో ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ సేవలు..

Author Neti Sudiksha | 24 Jul 2026, 02:21 PM | TELANGANA
దేశంలోనే తొలిగా తెలంగాణాలో ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ సేవలు..

దేశంలోనే తొలిసారిగా తెలంగాణాలో ఎలక్ట్రసిటీ అంబులెన్స్ సేవలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదలుపెట్టారు. వైద్య అత్యవసరాలలో 108 సేవలు అందించే తరహాలోనే ఈ కొత్త సేవ పని చేస్తుంది. తీగలు తెగి పడటం, ట్రాన్స్ ఫార్మర్లు పేలటం, షార్ట్ సర్క్యూట్, విద్యుత్ అంతరాయాలు వంటి ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పుడు ప్రత్యేకంగా తయారు చేసే వాహనాలు, అనుభవజ్ఞులైన టెక్నీషియన్ ల బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఖమ్మం జిల్లాలో ఎలక్ట్రసిటీ అంబులెన్స్ లు ఈ అంబులెన్స్ సేవలు మొదట ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు. ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఈ సేవ ద్వారా ప్రజలకు 24 గంటలు అత్యవసర విద్యుత్ సహాయం అందించనున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 4 - 5ఎలెక్ట్రసిటీ వాహనాలు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.తెలంగాణాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా మరింత సుస్థిరం చేయటం కోసం ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన అడుగు. సత్వర సేవలను అందించటం కోసమే ఈ స్పెషల్ అంబులెన్స్ లు సహజంగా వర్షాకాలంలో కరెంట్ తీగలు తెగిపోవటం, విద్యుత్ స్తంభాలు పడిపోవటం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో సాదాతన సర్వీస్ బృందాలు చేరుకోవటం కాస్త ఆలస్యం అవుతుంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అలాంటి జాప్యం లేకుండా ఎలెక్ట్రిసిటీ అంబులెన్స్ లు సత్వర సేవలను అందిస్తాయి.