Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పేపర్‌ లీక్‌లపై కఠిన చట్టం తీసుకొస్తున్నాం- చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి : కిరణ్ రిజిజు

Author Neti Sudiksha | 27 Jul 2026, 12:08 PM | NATIONAL
పేపర్‌ లీక్‌లపై కఠిన చట్టం తీసుకొస్తున్నాం- చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి : కిరణ్ రిజిజు

పరీక్షల నిర్వహణలో అక్రమాలను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును కేంద్రం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. పరీక్షల్లో అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని తీసుకొస్తాందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు-2026పై లోక్‌సభలో జరిగే చర్చలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని ఆయన కోరారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

'ఇది చాలా ముఖ్యమైన రోజు. దేశంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇటీవల విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇప్పుడు వాటికి చట్టబద్ధ రూపం కల్పించేలా సవరణ బిల్లును లోక్​సభలో ప్రవేశపెడుతున్నాం. ఈ చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలని కోరుతున్నాం. అయితే ఇలాంటి సమయంలో చర్చలో పాల్గొనకుండా సభను అడ్డుకోవడం ప్రజలకు సరైన సందేశం ఇవ్వదు. సభలో గందరగోళం సృష్టించడం కంటే బిల్లుపై చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాలి' అని రిజిజు సూచించారు.