Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఎన్టీఆర్‌కు వరుస ఎదురుదెబ్బలు..

Author Neti Sudiksha | 29 Jul 2026, 11:42 AM | Cinema
ఎన్టీఆర్‌కు వరుస ఎదురుదెబ్బలు..

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని వారాలుగా ప‌లు కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు కొత్త సినిమా ‘డ్రాగన్’ షూటింగ్ పదేపదే వాయిదా పడుతుండగా, మరోవైపు షూటింగ్ సమయంలో గాయపడటం, సోషల్ మీడియాలో చోటుచేసుకున్న వివాదాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అనేక కారణాలతో షూటింగ్‌కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
గతంలో షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గాయపడటంతో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ నిలిచిపోయింది. అనంతరం విదేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో జార్జియాలో ప్లాన్ చేసిన షెడ్యూల్‌ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కథకు సంబంధించిన మార్పులు, చర్చల కారణంగా కూడా షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి.ఇలా వరుస ఆటంకాల కారణంగా సినిమా విడుదల కూడా ముందుగా అనుకున్న షెడ్యూల్ నుంచి ఆలస్యమై, ప్రస్తుతం 2027 విడుదలపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒకసారి గాయపడి కోలుకున్న ఎన్టీఆర్ తాజాగా మరోసారి షూటింగ్ సందర్భంగా భుజానికి గాయమైనట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటూ కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ గాయం కారణంగా షూటింగ్‌కు మరోసారి బ్రేక్ పడినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.