Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

చిలకలగూడలో కొత్త బస్​ టెర్మినల్​ - ఫ్రీ కానున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు!

Author Neti Sudiksha | 30 Jul 2026, 02:10 PM | హైదరాబాద్
చిలకలగూడలో కొత్త బస్​ టెర్మినల్​ - ఫ్రీ కానున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు!

హైదరాబాద్​లోని జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోని రద్దీని తగ్గించేందుకు చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్, ఛార్జింగ్ స్టేషన్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీల మధ్య కుదిరిన ఉమ్మడి భూ బదిలీ ఒప్పందం ఆధారంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.

రైల్వేకు ఆర్టీసీ భూమి : ప్రస్తుతం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 70కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తూ, రోజుకు 40,000 మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. అయితే స్టేషన్ ఆధునికీకరణకు తగినంత స్థలం అందుబాటులో లేదు. దీనివల్ల స్టేషన్‌కు ఆనుకుని ఉన్న 2.77 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాచిగూడ డిపో వద్ద ఆర్టీసీకి 9 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాల స్థలాన్ని రైల్వేలకు అప్పగించి, దానికి బదులుగా చిలకలగూడలో 5 ఎకరాల స్థలాన్ని పొందే ప్రతిపాదనను ఆర్టీసీ చేసింది. మిగిలిన 4 ఎకరాల స్థలంలో రామాంతపూర్ వైపు ముఖ ద్వారం ఉండేలా కొత్త డిపోను నిర్మించాలని ఆర్టీసీ యోచిస్తోంది.

రేతిఫైల్ వద్ద రద్దీ నుంచి ఉపశమనం : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు, రేతిఫైల్ బస్ స్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. కొండాపూర్, మెహిదీపట్నం, చార్మినార్, పటాన్‌చెరు, దిల్​సుఖ్​నగర్, హయత్​నగర్ వంటి మార్గాల్లో నడిచే బస్సుల రాకపోకల వల్ల నిరంతరం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. చిలకలగూడలో టెర్మినల్ ఏర్పాటు చేయడం ద్వారా రేతిఫైల్ బస్​ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందున్న ప్రాంతాల్లో రద్దీ తగ్గుతుంది. ఈ కొత్త కేంద్రంలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, నిర్వహణ షెడ్లు ఉంటాయి. దానివల్ల ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆధునిక వెయిటింగ్ హాల్స్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డుల వంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ ముందున్న ప్రాంతాల్లో రేతిఫైల్ సిటీ బస్​స్టేషన్​ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గుతుంది. ఎలక్ట్రానిక్​ ఛార్జింగ్​ పాయింట్లు, మెయింటెనెన్స్​ షెడ్లు నిర్మించడం వల్ల ఈవీ బస్సుల వినియోగాన్నిపెంచవచ్చు. దీంతో ప్రయాణికులు ప్రశాంతంగా ప్రయాణించగలుగుతారు. ట్రాఫిక్ సమస్యనూ అరికట్టవచ్చు.

స్కైవాక్​తో ప్రయాణికులకు తొలగనున్న ఇబ్బంది : సుమారుగా రూ.700 కోట్లకు పైగా వ్యయంతో చేపడుతున్న ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఒక స్కైవాక్ నిర్మాణం చేపడుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌లో దిగి రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి అర కిలోమీటర్ దూరం నడవాల్సి వస్తోంది. ఈ స్కైవాక్ నిర్మాణం వల్ల ప్రయాణికులకు కలిగే ఆ ఇబ్బంది తొలగిపోతుంది. రేతిఫైల్ సిటీ బస్ స్టేషన్ వెనక భాగంలో 120 మీటర్ల పొడవైన స్కైవాక్ నిర్మాణానికి ఆర్టీసీ నుంచి అవసరమైన 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' పొందేందుకు చర్చలు జరుగుతున్నాయి.