Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఈ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి

Author Neti Sudiksha | 30 Jul 2026, 02:13 PM | హైదరాబాద్
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - ఈ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ పోలీస్ నియామక మండలి పోలీస్, ఎస్పీఎఫ్​, ఫైర్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు వివిధ విభాగాల్లో నియామకాలు చేపట్టనుండగా, దరఖాస్తు తేదీలను త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి కొలువుల సందడి మొదలైంది. 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) బుధవారం రాత్రి నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) శాఖలకు సంబంధించి వేర్వేరుగా 4 ప్రకటనలు వెలువడ్డాయి. వీటిలో ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు మొత్తంగా 7 వేలకు పైగా ఉన్నాయి.

పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు మండలి వెబ్‌సైట్‌ www.tgprb.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల స్వీకరణ తేదీని మాత్రం బోర్డు ఇంకా ప్రకటించలేదు. దరఖాస్తు ప్రొఫార్మాను త్వరలోనే వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు పోలీస్ ఉద్యోగాల నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాస రావు వెల్లడించారు. అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ ప్రమాణాలు సరిగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

ఇవి కూడా చదవండి