Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఆహారకల్తీ ముఠాలపై కూంబింగ్‌లా ఆపరేషన్స్​ చేస్తాం : డీజీపీ సీవీ ఆనంద్

Author Neti Sudiksha | 07 Aug 2026, 11:57 AM | హైదరాబాద్
ఆహారకల్తీ ముఠాలపై కూంబింగ్‌లా ఆపరేషన్స్​ చేస్తాం : డీజీపీ సీవీ ఆనంద్

రాత్రి వేళల్లో పోలీసులు తమ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా చూడగలిగితే విజయం సాధించినట్లేనని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. టెక్నాలజీని ఎంత వాడుతున్నా బేసిక్ పోలీసింగ్​ను ఎట్టి పరిస్థితుల్లో మరువకూడదని అధికారులకు, సిబ్బందికి నిత్యం సూచిస్తున్నట్లు తెలిపారు. సాధారణ నేరాల్లో కోల్పోయే నగదు కంటే సైబర్ నేరాల్లో ఎక్కువ మొత్తంలో అమాయక ప్రజలు నష్టపోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.

చిన్నారులకు చాకెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఘటనలపై ఆవేదన వ్యక్తం చేసిన డీజీపీ మత్తు మహమ్మరిని కూకటి వేళ్లతో పెకలించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడంతో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే పలువురికి బుల్లెట్​ ప్రూఫ్ వాహనాలతో పాటు సెక్యూరిటీని కూడా తగ్గించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అధునాతన పోలీసింగ్, ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు తదితర అంశాలపై చేపట్టబోయే విషయాలపై స్పష్టతనిచ్చారు.

ఆహారకల్తీ నియంత్రణకు 100 మంది పోలీసులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు డీజీపీ ఆనంద్ వెల్లడించారు. రాబోయే 15 ఏళ్లకు అనుగుణంగా పోలీసింగ్‌లో సమూల మార్పులకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. సైబర్‌నేరాలు, మాదకద్రవ్యాలు, ఆహారకల్తీ, ట్రాఫిక్‌ సమస్యల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణ పోలీస్‌ మాన్యువల్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ప్రశ్న: 100 రోజుల్లో మీరు గుర్తించిన అంశాలు ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా చేయబోతున్నారు?

జవాబు : ఇంతకు ముందు హైదరాబాద్‌ సీపీగా, హోంశాఖ చీఫ్​ సెక్రటరీగా, ఏసీబీ, విజిలెన్స్‌ డీజీగా పనిచేసినప్పటి నుంచీ చాలా అవగాహన పెంచుకున్నా. గత 30 ఏళ్లలో మావోయిస్టుల ప్రాబల్యంతో పోలీస్‌శాఖ ఒక రకమైన మార్గంలో పయనించింది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో పూర్తిగా వేరే దిశలో నడిపించాల్సిన పరిస్థితులు వచ్చాయి. గడచిన 100 రోజుల్లో రివ్యూలు, పర్యటనల్లో ఇదే విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశా. ప్రస్తుతం మాదకద్రవ్యాలు, సైబర్‌ క్రైమ్స్, ఆహారకల్తీ, ట్రాఫిక్‌ సమస్యల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్, ఏసీబీలను బలోపేతం చేయాలని గవర్నమెంట్ భావిస్తోంది. పోలీస్‌శాఖలో 93 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ల నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకుని ట్రాఫిక్ తదితర విభాగాలకు కేటాయిస్తున్నాం. ఏఐ ఆధారిత టెక్నాలజీని విస్తృతం చేసేందుకు టీ-స్పార్క్‌ను ఏర్పాటు చేశాం.

ప్రశ్న: యువతలో అలజడి పెరుగుతున్నట్లు ఇటీవలి ఉదంతాలు నిరూపిస్తున్నాయి. మీరేం చేయబోతున్నారు.?

జవాబు : నిరుద్యోగ సమస్య, అవినీతి తీవ్రమైతే యువతలో అలజడి పెరుగుతుంది. చిన్నచిన్న నేరాలకు పాల్పడుతున్న యువతను విచారిస్తున్న క్రమంలో వారి భావాలు బయటపడుతున్నాయి. ఇటీవలే దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ఉద్యమం యువత మనోభావాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. ఏఐ ఆధారిత ఎనలిటిక్స్‌ ద్వారా యువత భావాల్ని గుర్తించేందుకు ప్రత్యేక విభాగాన్ని తీర్చిదిద్దుతున్నాం. వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తాం.