Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

బీజేపీకి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉంది..CM రేవంత్ రెడ్డి

Author Neti Sudiksha | 05 Sep 2026, 01:36 PM | Politics
బీజేపీకి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఉంది..CM రేవంత్ రెడ్డి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఓట్ల తొలగింపు కుట్రలకు తెరలేపిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవాళ కొడంగల్ నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌ కు గుర్తింపు వచ్చిందని, ఇక్కడి ప్రజల అభిమానమే తన బలమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం SIR పేరుతో నాటకాలు ఆడుతూ.. కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో ఇదే వ్యూహంతో గెలిచారని, ఇప్పుడు తెలంగాణలోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే టార్గెట్..
వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దుర్బుద్ధితో బీజేపీ (BJP) ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసిందని విమర్శించారు. గతంలో ప్రతిపక్షాలను అణచివేయడానికి ఈడీ, సీబీఐలను ఉపయోగించిన వారు.. ఇప్పుడు నేరుగా ఓట్లను తొలగించి తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. చిన్న చిన్న తప్పిదాలను సాకుగా చూపి పేదల ఓట్లను గల్లంతు చేస్తున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్‌ను ఓడించే ఈ కుట్రలో బీజేపీకి బీఆర్‌ఎస్ (BRS) పార్టీ కూడా మద్దతు ఇస్తోందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు దిశానిర్దేశం..

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ప్రజల ఓట్లను రక్షించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల వారీగా బీఎల్ఏ (BLA)లను సమన్వయం చేసుకోవాలని, ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకుని ప్రతి బూత్‌లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి కోరారు.