Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

జనసేన అధ్యక్షురాలిగా కొండా సురేఖ ⁉️

Author Neti Sudiksha | 05 Sep 2026, 01:40 PM | Politics
జనసేన అధ్యక్షురాలిగా కొండా సురేఖ ⁉️

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ తదుపరి రాజకీయ అడుగుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆమె జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.కాంగ్రెస్‌ పార్టీలో తనకు ఎదురైన పరిణామాలపై కొండా సురేఖ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆమె భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే జనసేనలోకి కొండా సురేఖను ఆహ్వానించి, తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించే అంశంపై చర్చ జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది.జనసేన తెలంగాణలో పార్టీని మరింత విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో, రాజకీయంగా సీనియర్‌ అనుభవం ఉన్న కొండా సురేఖకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందనే చర్చ జరుగుతోంది.కొండా సురేఖను జనసేన తెలంగాణ అధ్యక్షురాలిగా నియమించే ప్రతిపాదన తెరపైకి వచ్చిందనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే దీనిపై జనసేన పార్టీ నుంచి గానీ, కొండా సురేఖ నుంచి గానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం, ఊహాగానాలుగానే ఉన్నాయి. కొండా సురేఖ జనసేనలో చేరిక, తెలంగాణ అధ్యక్షురాలిగా నియామకంపై జనసేన అధిష్ఠానం లేదా కొండా సురేఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.