Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

వచ్చే నెల నుంచి తెలంగాణ సీఎస్​ ఎవరు? - ముఖ్యమంత్రి మనసులో ఏముంది?

Author Neti Sudiksha | 14 Jun 2026, 12:17 PM | TELANGANA
వచ్చే నెల నుంచి తెలంగాణ సీఎస్​ ఎవరు? - ముఖ్యమంత్రి మనసులో ఏముంది?

వచ్చే నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? రామకృష్ణారావును మరోసారి పొడిగిస్తారా? లేక కొత్తవారిని నియమిస్తారా? అనే అశం ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్. ప్రస్తుత సీఎస్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్నందున ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు సంజయ్ జాజు, జయేశ్​ రంజన్, వికాస్‌రాజ్, సవ్యసాచి ఘోష్ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. అయితే కీలకమైన కుర్చీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనసులో ఏముందో త్వరలోనే తేలనుంది.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు సీఎస్​లు : రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి కుర్చీలో ఎవరు ఉండబోతున్నారన్న అంశంపై మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు సీఎస్‌లు పని చేశారు. ప్రభుత్వం ఏర్పడే నాటికే సీఎస్‌గా ఉన్న శాంతికుమారి అలాగే కొనసాగి 2025 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. అప్పుడు సీఎస్ ఎవరనే అంశంపై అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ చివరకు 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖలో అత్యంత కీలకంగా వ్యవహరించడంతో పాటు వివాదరహితుడు, సమర్థుడిగా పేరున్నందున రామకృష్ణారావు వైపు ప్రభుత్వం మొగ్గుచూపింది.