Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఇవన్నీ టాక్సిక్ అలవాట్లే! - మీలోనూ ఉన్నాయా?

Author Neti Sudiksha | 14 Jun 2026, 12:19 PM | HEALTH
ఇవన్నీ టాక్సిక్ అలవాట్లే! - మీలోనూ ఉన్నాయా?

సరైన ఆలోచనలు, అలవాట్లే మన ప్రగతికి బాటలు వేస్తాయి. కానీ, కొన్ని ఇబ్బందికర అలవాట్ల వల్ల జీవితకాలం బాధపడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. అందుకే వాటిని పక్కన పెట్టేయాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

ఆలోచన విధానం : కొంతమంది చిన్న విషయాలను లేదా పొరపాట్లను కూడా తట్టుకోలేక తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. దీనివల్ల వారు మానసిక ప్రశాంతతను కోల్పోవడమే కాకుండా, చుట్టుపక్కల వారితో అనవసరమైన గొడవలను దిగి సంబంధాలను పాడు చేసుకుంటారట. ఇలా ప్రతికూల ఆలోచనలతో చిన్న విషయాన్ని కూడా ఒక పెద్ద విపత్తులా భావించి ఒత్తిడికి గురవతారని నిపుణులు చెబుతున్నారు.

మొటిమలు, నల్ల మచ్చలకు "వేప" ఆయుధమా? - నిపుణులు ఏం చెప్తున్నారంటే!

భావాలను వ్యక్తపరచడం : ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు తమ గురించి ఏమనుకుంటారో అనే భయంతో తమ భావాలను మనస్సులో దాచుకుంటారు. ఇలా చేయడం వల్ల మెదడుపై, మనసుపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది క్రమంగా ఆందోళన, మానసిక అలసట, ఒంటరితనానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, నచ్చని విషయాన్ని మొహమాటం లేకుండా, సున్నితంగా 'నో' చెప్పడం లేదా మీ అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సాకులు వెతకడం : చాలామంది 'ఇప్పుడు కాదు, సమయం వస్తుంది' అంటూ వేచి చూస్తునే ఉంటారు. దీనివల్ల విలువైన సమయం వృధా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. చివరి నిమిషంలో ఒత్తిడి, ఆందోళన పెరిగి పనుల నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంగా 'ఇప్పుడే సరైన సమయం' అని భావించి, పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి వెంటనే మొదలు పెట్టాలని సలహా ఇస్తున్నారు.

వాయిదా వేయడం : కొంతమంది ముందుగా అనుకున్న ప్రణాళికలను పక్కన పెట్టి అత్యవసర పరిస్థితులను సృష్టించుకుంటారు. దీనివల్ల పనులలో నాణ్యత దెబ్బతినడంతో పాటు తప్పులు ఎక్కువగా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే, శారీరక, మానసిక అలసట పెరుగుతుందని అంటున్నారు. దీర్ఘకాలంలో ఇది నమ్మకాన్ని, వృత్తిపరమైన గుర్తింపును దెబ్బతీస్తుందని హెచ్చరిన్నారు.

పరిస్థితులను ఎదుర్కోవడం : కొందరు ఇతరులతో మాట్లాడటానికి కష్టంగా అనిపిస్తే పరిస్థితిని వదిలేసి పారిపోతుంటారు. ఇలా ప్రతిసారీ తప్పించుకోవడం వల్ల 'నేను ఎవరితోనూ మాట్లాడలేను' అనే ప్రతికూల భావన మనసులో బలంగా నాటుకుపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల మీ మీద మీకే నమ్మకం పూర్తిగా పోతుందని చెబుతున్నారు.

అక్కడే ఆగిపోవడం : గతంలో జరిగిన పొరపాట్లు, పరాభావాలను పదేపదే గుర్తు చేసుకొని ఆగిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే మన మనసులో 'నేను దేనికీ పనికిరాను' అనే తప్పుడు నమ్మకం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇది కొత్త ప్రయత్నాలు చేయకుండా మనల్ని అడ్డుకుంటుందని తెలియజేస్తున్నారు.