Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఇన్​స్టా, ఫేస్​బుక్ ప్రేమలు" - మీరూ ఈ మూడు దశలను దాటేశారా?

Author Neti Sudiksha | 14 Jun 2026, 12:20 PM | HEALTH
ఇన్​స్టా, ఫేస్​బుక్ ప్రేమలు" - మీరూ ఈ మూడు దశలను దాటేశారా?

పంజాబ్​లోని పటియాలాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ఆమె మాజీ ప్రియుడు 20సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఆపై తానూ అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆఫీసు పనివేళల్లో తమ కళ్లెదుట జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపేందుకు సహోద్యోగులు విఫలయత్నం చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. వాటిపై ఆరా తీస్తే సోషల్ మీడియాలో పరిచయాలు కనిపిస్తుంటాయి. ఇన్​స్టా, ఫేస్​బుక్​లో చిగురించిన స్నేహం ప్రేమగా మారి విడిపోయిన తర్వాత హత్యలకు దారితీసినట్లుగా కనిపిస్తుంటుంది.

అదెలా సాధ్యం?

ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత అంత ఘోరంగా ఎందుకు హతమారుస్తారు? సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన పరిచయంతో ప్రేమ ఎలా సాధ్యం? ప్రేమైనా, పెళ్లైనా ముందూ, వెనుక ఎన్నో ఆలోచిస్తాం. కానీ, ప్రత్యక్షంగా చూడని వారిని ప్రేమించడం ఎలా సాధ్యం? ఇలాంటి సంఘటనల వెనకాల పెద్ద చరిత్ర ఉందని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు.

సోషల్‌ మీడియాలో 'హనీట్రాప్‌' ఘటనలు సైతం తరచూ వార్తల్లోకెక్కుతాయి. వీటిని సాధారణ నేరాలు కానే కాదు. మనసు ఎలా పనిచేస్తుంది? అది బలహీనతగా ఎలా మారుతుంది? అనే విషయాలను తెలియజేసే ఘటనలు ఇవి. ఒక్కసారికే ఇలా వలలో పడడం జరగదని పరిచయం, ప్రత్యేక శ్రద్ధ, దగ్గరితనం అనే మూడంచెల్లో జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

ట్రెండింగ్​లో "1-1-1-1 రూల్‌" - భార్యాభర్తల మధ్య గొడవలకు "నో" ఛాన్స్!

ఇవి కూడా చదవండి

వలవేసే వారు ముందుగా మాటలు కలిపి పరిచయం పెంచుకుంటారు. తరచూ కామెంట్లు, కాంప్లిమెంట్లు, ప్రశంసలతో ముంచెత్తుతారు. ఆ తర్వాత మనసులో చోటు సంపాదించి దగ్గరవుతారు. ఈ సమయంలో వారు మన భావోద్వేగాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు. ద్వేషించే వారి మరింత ద్వేషిస్తున్నట్లుగా, మీ ఇష్టాలు, అభిరుచులను తమకు ఇష్టమైనవిగా ప్రకటిస్తుంటారు. ప్రారంభంలో ఏ విషయంలోనూ మీకు వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేయరు. ఇక వారి గురించి ఆలోచిస్తున్నట్లు తెలియగానే కొన్నాళ్లు కనిపించకుండా ఉంటారు. ఇక్కడే పెద్ద మార్పు జరుగుతుంది. ఈ మార్పు వల్ల సదరు వ్యక్తిపై విచిత్రమైన ఆకర్షణ పెరుగుతుంది.

తనకు ఏమైంది? నా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎందుకు దూరమయ్యారు? అని ఇలా ఆలోచిస్తూ తమను తామే ప్రశ్నించుకుంటూ కలత చెందుతారు. సరిగ్గా అదే సమయంలో, అవతలి వ్యక్తి తిరిగి ప్రత్యక్షమవుతారు. మీపై కొంచెం ప్రేమ చూపించగానే కలత పోయి ప్రేమ పెరిగిపోయి ఇంకాస్త లోతులో కూరుకుపోతారు.

కాగ్నిటివ్‌ బయాస్‌ అంటే

మనకు నచ్చిందే నిజమని నమ్మడం సహజ లక్షణం. ఎవరైనా మనతో బాగా మాట్లాడితే చాలు! వాళ్లవల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించనివ్వదు. అందుకే నచ్చిన చిన్న విషయాలు గుర్తుంచుకుని మిగతా ప్రమాదాలను, స్నేహితులు, తల్లిదండ్రుల హెచ్చరికలను పక్కన పెడతాం. దీన్నే "కాగ్నిటివ్‌ బయాస్‌" అంటారు. ఈ సమయంలో నిర్ణయాలు మన చేతుల్లో కాకుండా భావోద్వేగాల అదుపులోకి వెళ్తాయి. అవతలి వ్యక్తికి దూరంగా ఉండటం (ఆన్‌లైన్‌లోనే అయినా) కష్టంగా అనిపించడం ఇందులో తొలి దశ. అనుబంధం అవసరంలా అనిపించడమే నిజమైన వల అని తెలుసుకోవాలి. వాస్తవానికి బయటి నుంచి చూస్తే అది ఒక చాట్‌ మాత్రమే కానీ, లోతుగా చూస్తే అది ఆధారపడే పరిస్థితి.

ఆ లోటు తీర్చుకోవడానికే

ఇది కేవలం వ్యక్తిగత బలహీనత కాదని, సమాజంలో పెరుగుతున్న భావోద్వేగాల బోలుతనానికి నిదర్శనం అని ప్రముఖ సైకాలజిస్ట్ వడ్లమూడి చంద్రకళ తెలిపారు. కుటుంబాల్లో, స్నేహాల్లో మనుషులు భౌతికంగా దగ్గరగానే ఉంటున్నా మానసికంగా చాలా దూరంగా ఉంటున్నారని ఆమె వివరించారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో సాంత్వనను వెతుక్కుంటున్నారని చెప్పారు. సమస్య సోషల్‌ మీడియాలో లేదని, మన అవగాహనాలోపం అని స్పష్టం చేసారు. మనసులో ఎవరో తెలీని వ్యక్తి గురించి కలత మొదలైందంటే ఆగి ఆలోచించమని అర్థం చేసుకోవాలని సూచించారు. మన భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకున్నప్పుడు, ఎదుటి వారు వాటిని ఎలా వాడుకుంటారో మనం గ్రహించగలిగితే అదే మనకు నిజమైన భద్రత అని తెలిపారు.