Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

"శంభాల గ్రామంలో కల్కి జననం" - తల్లిదండ్రులు హరిప్రియుడు-దేవప్రభ!

Author Neti Sudiksha | 14 Jun 2026, 12:23 PM | Bhakti
"శంభాల గ్రామంలో కల్కి జననం" - తల్లిదండ్రులు హరిప్రియుడు-దేవప్రభ!

త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడి అవతారమెత్తిన శ్రీమహావిష్ణువు కలియుగంలో కల్కి అవతారంలో జన్మిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుపురాణం, పద్మపురాణాల్లో ఇదే విషయాన్ని వెల్లడించినా, ఈ భూగోళంపై కల్కి అవతారం ఎప్పుడు, ఎక్కడ ఉంటుంది? ఏ ప్రాంతంలో ఎవరికి జన్మిస్తాడు? అనే సందేహాలు అనేకం ఉన్నాయి. శ్రీరాముడి తల్లిదండ్రులు దశరథుడు కాగా తల్లి కౌసల్యాదేవి, అదే విధంగా శ్రీకృష్ణుడి తల్లి దేవకి కాగా, తండ్రి వసుదేవుడు అని తెలిసిందే. మరి కల్కి అవతార పురుషుడి తల్లిదండ్రులు ఎవరు? వారి పేర్లేమిటి? కల్కి అవతారం, జన్మ రహస్యాలపై కొందరు జ్యోతిష్యులు, పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న ప్రకారం ఈ కథనం.

విగ్రహం లేని "శివాలయం"! - కాకరకాయ అన్నం "ఆవిరి"లో పరమాత్మ స్వరూపం!

ఆ రెండు అవతారాల్లో

ఇవి కూడా చదవండి

శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి స్వాయంభువ మనువు అనే మహర్షి నైమిశారణ్యం, గోమతీనది తీరంలో కఠోర తపస్సు చేశాడట. అందుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొమ్మని అనగా, వరుసగా మరో మూడు జన్మల్లో తనకు పుత్రుడుగా పుట్టాలని కోరుకున్నాడట. "మంచి వరమే కోరావు. తథాస్తు! ఇది నాకూ సంతోషమే" అని దీవించాడట విష్ణుమూర్తి. ఆ ప్రకారం స్వాయంభువ మనువు మొదట త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో దశరథుడిగా జన్మించగా, అతడి భార్య కౌసల్యగా జన్మించింది. వారి ఆ తర్వాత జన్మలో వారే మళ్లీ దేవకీ, వసుదేవులయ్యారు. అలా ప్రథమ జన్మలో దశరథమహారాజు - కౌసల్యలకు శ్రీరాముడిగా, రెండో జన్మలో దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడిగా శ్రీమహావిష్ణువు అవతరించాడు.

శంభాల గ్రామంలో

విష్ణుమూర్తి తాను వరం ఇచ్చిన విధంగా స్వాయంభువ మనువుకు శ్రీరామ, శ్రీకృష్ణులుగా జన్మించి ధర్మ సంస్థాపనం చేశాడు. ఇక కలియుగంలో మూడో జన్మ ఇంకా మిగిలి ఉంది. ఈ యుగాంతానికి ముందు స్వాయంభువ మనువు శంభాల అనే గ్రామంలో జన్మిస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. హరిప్రియుడనే నామంతో ఆయన భార్య దేవప్రభ పేరుతో జన్మిస్తుందట. వారికి కలిగే సంతానమే శ్రీమహావిష్ణువు మూడో అవతారమైన కల్కి. విష్ణువు కల్కి భగవానుడిగా అవతరించిన అనంతరం స్వాయంభువ మనువు ముక్తుడు అవుతాడని "పద్మపురాణం" ద్వారా తెలుస్తోంది.