Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

బాకీతో స‌హా మొత్తం ఆడబిడ్డ‌ల‌కు ఇయ్.. నేను రాజీనామా చేస్తా : కేటీఆర్

Author Neti Sudiksha | 14 Jun 2026, 07:51 PM | TELANGANA, హైదరాబాద్
బాకీతో స‌హా మొత్తం ఆడబిడ్డ‌ల‌కు ఇయ్.. నేను రాజీనామా చేస్తా : కేటీఆర్

రేవంత్ రెడ్డి కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తా అంటుండు.. నువ్వు కోటీశ్వ‌రుల‌ను చేసుడు దేవుడెరుగు.. నువ్వు ముందైతే ల‌క్షాధికారులు చెయ్‌. ఒక్కొక్క ఆడ‌బిడ్డ‌కు ల‌క్షా 50 వేలు ఇస్తా అని చెప్పిన‌వ్‌ క‌దా.. నువ్వు కోటి మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని రేవంత్ రెడ్డికి చెబుతున్నాన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి కేటీఆర్, మాజీ మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్, పార్టీకి చెందిన ముఖ్య‌నేతలు హాజ‌రయ్యారు. ఈ స‌మావేశంలో ఎస్ఐఆర్‌, పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ‌పై దిశానిర్దేశం చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి బాధ‌ల్లా మ‌న ప‌దవులు కావాల‌నే క‌దా.. మ‌న‌ముండొద్దు రాజ‌కీయంలో ప‌క్క‌కు పోవాల‌నే క‌దా.. ఆడ‌బిడ్డ‌ల‌కు పోయిన రెండున్న‌రేళ్లు వ‌చ్చే రెండున్న‌రేళ్లు బాకీతో స‌హా ఒక్కొక్క‌రికి రూ. ల‌క్షా 50 వేల చొప్పున మొత్తం ఆడబిడ్డ‌ల‌కు ఇయ్‌.. నేను రాజీనామా చేస్తా.. అట్లాగే మా త‌మ్ముళ్ల‌కు రూ. 4వేలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన‌వ్ క‌దా.. పోయిన రెండున్నర సంవ‌వ‌త్సరాలు, మొత్తం క‌లిపి 40 ల‌క్ష‌ల మంది మా త‌మ్ముళ్ల‌కు, చెల్లెళ్ల‌కు ఇయ్‌.. త‌ప్ప‌కుండా రాజకీయ‌మే వ‌దిలేస్తా అని విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌న్నారు.

ఇవి కూడా చదవండి

మ‌ళ్లీ 2028లో కూడా గులాబీ జెండా ఎగ‌రేద్దామా.. ?

మోచేతికి బెల్లం పెట్టిండు. ఆగం చేసిండు.. పోయి కుర్చీల కూర్చున్న‌డు. హైద‌రాబాదోళ్లు, ఖైర‌తాబాద్‌లో ఒక్క‌డు కూడా కాంగ్రెస్ పార్టీని న‌మ్మ‌లేదు. మీరు కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇయ్య‌లేదు. మీరేమ‌న్నా నాగేంద‌ర్‌కు ఓటేశారా.. మీరంతా కేసీఆర్‌కు వేశారు. మాకు తెలుసున‌న‌న్నారు. నాగేంద‌ర్‌ను చూసి ఓటేస్తే మొత్తం నాకేస్త‌డు.. తెల్వ‌దా మ‌న‌కు.. అన్న‌ట్టే నాకేసిండు.

అట్లే జ‌రిగింది కానీ కేసీఆర్ గెల‌వాలే క‌దా..ఈయ‌న స‌క్క‌టోడు కాక‌పోయినా ఎమ్మెల్యే అయితే కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయిత‌రు క‌దా అని ఓటేసిర్రుని అన్నారు. ఆయ‌న పోయి రేవంత్ రెడ్డి సంక‌ల కూర్చొని పెద్ద పెద్ద మాట‌లు చెప్తున్న‌డు. ఖైర‌తాబాద్‌లో రెండు సార్లు గులాబీ జెండా ఎగ‌రేసినం. 2018, 2023లో శ్రీనివాస్ యాద‌వ్ చెప్పిన‌ట్టు మ‌ళ్లీ 2028లో కూడా గులాబీ జెండా ఎగ‌రేద్దామా..? అని కేటీఆర్ పిలుపునిచ్చారు.