Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

థియేటర్లలో సందడి చేస్తున్న కంగనా రనౌత్ 'భారత్ భాగ్య విధాత'- ఆ రాష్ట్రంలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన సీఎం

Author Neti Sudiksha | 15 Jun 2026, 11:35 AM | Cinema
థియేటర్లలో సందడి చేస్తున్న కంగనా రనౌత్ 'భారత్ భాగ్య విధాత'- ఆ రాష్ట్రంలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన సీఎం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్​లో నటించిన లేటెస్ట్ సినిమా 'భారత్ భాగ్య విధాత' జూన్ 12న రిలీజై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. 26/11 ముంబయి దాడుల నేపథ్యంలో ఇది తెరకెక్కింది. అయితే రిలీజ్ తర్వాత కూడా కంగనా ఈ సినిమాను ఎక్కువగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పలు రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి పన్ను మినహాయింపు దక్కింది. మరి అది ఏ రాష్ట్రంలో అంటే?

స్పెషల్ స్క్రీనింగ్
తాజగా మూవీటీమ్ చండీగఢ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. ఈ చిత్ర ప్రదర్శనకు హీరోయిన్​ కంగనా రనౌత్​తోపాటు, హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రం హరియాణాలో 'భారత్ భాగ్య విధాత' సినిమాను టాక్స్​ ఫ్రీగా డిక్లేర్డ్ చేశారు. ఇలాంటి స్ఫూర్తిదాయక సినిమా అందరూ చూడాలని పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. 'ఇలాంటి స్ఫూర్తిదాయకమైన చిత్రాలను మనమందరం చూడాలని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం మనకు స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా మన బాధ్యతలను గుర్తుచేస్తుంది. అందుకే ఈ చిత్రానికి హరియాణాలో పన్ను రహితంగా ప్రకటించాలని నిర్ణయించాం' అని మీడియాతో సీఎం సైనీ వెల్లడించారు. కాగా, ఈ చిత్రానికి ఇటీవల దిల్లీలో కూడా పన్ను మినహాయింపు లభించగా, తాజాగా హరియాణాలో టాక్స్​ ఫ్రీ గా డిక్లేర్డ్ చేశారు.