Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

బరువు తగ్గేందుకు "ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్" - వీరు మాత్రం అస్సలు చేయొద్దట!

Author Neti Sudiksha | 15 Jun 2026, 11:38 AM | HEALTH
బరువు తగ్గేందుకు "ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్" - వీరు మాత్రం అస్సలు చేయొద్దట!

ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గడానికి 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' పద్ధతిని ఫాలోవుతున్నారు. అయితే, ఇలా డైటింగ్ చేసే ముందు మనం దానికి అర్హులమా? కాదా? అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇది అందరికీ సురక్షితం కాదని సూచిస్తున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్​తో కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఎవరు ఈ పద్ధతిని అనుసరించాలి? తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటే : ఈ డైట్​లో ఆహారంపై కాకుండా టైంకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 16:8, 20:4 పద్ధతిని బాగా ఫాలో అవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అంటే 16 గంటలు లేదా 20 గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఫాస్టింగ్ చేసి ఆ తర్వాత 8 గంటలు లేదా 4 గంటలు కడుపు నిండా తింటారని చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ 16 లేదా 20 గంటలు ఉపవాసం ఉంటారని పేర్కొంటున్నారు. ఈ పద్ధతిలో కేలరీల గురించి చింతించాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు. ఏమైనా తినొచ్చట. ఆకలి, బరువును నియంత్రించడంలో ఈ డైట్ సహాయపడుతుందని వివరిస్తున్నారు. దీనివల్ల శరీర మెటబాలిజం మెరుగుపడుతుందట. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుందని, 10 వారాలలో 7-11 పౌండ్ల బరువు తగ్గే అవకాశం ఉందని the nutrition source పేర్కొంది.