Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

వరంగల్‌లో ‘కళ్యాణమస్తు ’ సామూహిక వివాహాల పోస్టర్ ఆవిష్కరణ

Author Neti Sudiksha | 15 Jun 2026, 12:15 PM | TELANGANA, వరంగల్
వరంగల్‌లో ‘కళ్యాణమస్తు ’ సామూహిక వివాహాల పోస్టర్ ఆవిష్కరణ

వరంగల్, జూన్ 15 సుదీక్ష న్యూస్ :: శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించనున్న “కళ్యాణమస్తు ” సామూహిక వివాహాల పోస్టర్‌ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని వివాహాల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచి యువతకు వివాహాలు జరిపించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 24న ఉదయం 8 గంటల నుంచి సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.వివాహం చేసుకోవాలనుకునే వధూవరులకు 18 సంవత్సరాలు నిండివుండాలని, అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన జంటలు ట్రస్ట్‌ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వివాహ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించి, వధూవరులకు అవసరమైన వస్తువులను అందజేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 98484 23133, 98498 21999 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.