Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తలస్నానం చేశాక జుట్టును టవల్‌తో గట్టిగా చుట్టేస్తున్నారా?

Author Neti Sudiksha | 16 Jun 2026, 12:17 PM | HEALTH
తలస్నానం చేశాక జుట్టును టవల్‌తో గట్టిగా చుట్టేస్తున్నారా?

తలస్నానం చేసిన వెంటనే జుట్టును టవల్‌తో గట్టిగా చుట్టేయడం చాలామందికి అలవాటు. జుట్టు తొందరగా ఆరిపోతుందనే ఉద్దేశంతో అమ్మమ్మల కాలం నుంచి ఇదే టెక్నిక్‌ను వాడుతున్నారు. కానీ అది మంచి అలవాటు కాదని.. వెంట్రుకలు చిట్లిపోయి, రాలిపోవడానికి అదే ప్రధాన కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తల తడిగా ఉన్న సమయంలో జుట్టు అత్యంత బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో జుట్టును రుద్దడం, బలంగా పిండి తుడవడం లేదా టవల్‌తో గట్టిగా చుట్టేయడం వల్ల వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల జుట్టు రాలడం, చిట్లిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతాయి.

తడి జుట్టు ఎందుకు సున్నితంగా ఉంటుంది
జుట్టు వెలుపలి పొరను క్యూటికల్ అని పిలుస్తారు. జుట్టు తడిగా ఉన్నప్పుడు ఈ రక్షణ పొర కొద్దిగా పైకి లేస్తుంది. దీంతో వెంట్రుకలు మరింత బలహీనంగా మారి సులభంగా దెబ్బతింటాయి. ఇలాంటి సమయంలో టవల్‌తో గట్టిగా రుద్దడం వల్ల వెంట్రుకల మధ్య ఘర్షణ పెరిగి అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఇదే కొనసాగితే జుట్టు సహజ మెరుపును కోల్పోతుంది. రెండు చివరలు చిట్లిపోవడం, రఫ్ టెక్షర్, అధిక హెయిర్‌ఫాల్ వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

టవల్‌తో రుద్దడం ఎందుకు ప్రమాదకరం
జుట్టును ఆరబెట్టుకోవడమే కాదు.. ఆరబెట్టుకునే విధానం కూడా చాలా ముఖ్యమని హెయిర్ కేర్ నిపుణులు చెబుతున్నారు. చాలామంది జుట్టు త్వరగా ఆరాలని టవల్‌తో బలంగా రుద్దుతుంటారని తెలిపారు. ఇలా చేయడం వల్ల క్యూటికల్ పొర మరింత దెబ్బతిని వెంట్రుకలు చిక్కులు పడతాయి. ముఖ్యంగా సాధారణ కాటన్ టవల్స్ కొంత గరుకుదనాన్ని కలిగి ఉంటాయి. అవి జుట్టులోని తేమను వేగంగా పీల్చేసి, అవసరమైన సహజ తేమను కూడా తొలగించే ప్రమాదం ఉంది. దీనివల్ల జుట్టు మరింత పొడిగా మారుతుంది.