Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సీజనల్ హెయిర్ ఫాల్ - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!

Author Neti Sudiksha | 16 Jun 2026, 12:21 PM | HEALTH
సీజనల్ హెయిర్ ఫాల్ - ఆహారంలో వీటిని చేర్చుకుంటే మేలంటున్న నిపుణులు!

సీజన్ మారిందంటే మొదట ప్రభావం పడేది శిరోజాలపైనే! ఇలాంటప్పుడు జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, రాలిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, కొన్ని ఆహార పదార్థాలు ఈ విషయంలో మనకు సాయపడతాయని తెలుసా? వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తీవ్రం కాకుండా కాపాడతాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

పసుపు : ఇందులో ఉండే కర్​క్యుమిన్ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుందట. ఈ క్రమంలో కురులు ఆరోగ్యంగా ఉండాలని కొబ్బరినూనె ఎలా రాసుకుంటామో.. అలాగే, పసుపు ను కూడా ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, లారిక్ యాసిడ్ కురులను దృఢంగా చేస్తాయని సూచిస్తున్నారు.

అవిసెలు : ఇవి తిన్నా, నానబెట్టి కురులకు పెట్టినా మంచిదే! రోజూ మాత్రం ఓ స్పూను తప్పక తినాలంటున్నారు నిపుణులు. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మాడుకి మేలు చేస్తాయని చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా ఊడే జుట్టుకీ అడ్డుకట్ట వేయగలవని సూచిస్తున్నారు. ఈ క్రమంలో అవిసె గింజలలో లిగ్నాన్ అనే ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందని International Journal of Applied Research పేర్కొంది. లిగ్నాన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి బాగా పనిచేస్తుందని తెలిపింది.

వృద్ధాప్య ఛాయలు ముడతల్ని అడ్డుకోవడమెలా? - నిపుణులు సూచిస్తున్న టిప్స్ ఇవీ!

ఉల్లిపాయలు : చాలామంది కూరలు, పులుసుల్లోని ఉల్లిపాయలను పక్కన పెట్టేస్తుంటారు. అలా చేయవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఇవి కురులకు మేలు చేస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కురులను ఆరోగ్యంగా ఉంచటంతో పాటు జుట్టును ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి కూడా రక్షిస్తాయని International Journal of Pharmaceutical Sciences ప్రచురించింది.

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీ : చాలామంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా ఉంటుంది. వీటికి బదులుగా గ్రీన్​ టీకి మారమంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కురుల ఆరోగ్యానికి సాయపడుతాయని తెలియజేస్తున్నారు. గ్రీన్ టీ ఆకులలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయని, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయని researchgate పేర్కొంది.

గింజలు : సాయంత్రం పూట బజ్జీలు, సమోసాలు లాంటివి స్నాక్స్​గా తింటుంటారు చాలామంది. వీటికి బదులుగా నట్స్ తీసుకోమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, గుమ్మడి గింజలకు తప్పక చోటివ్వాలని సూచిస్తున్నారు. వీటిలో జింక్, ఐరన్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయని చెబుతున్నారు. ఇవన్నీ కురులకు దృఢంగా చేసి, రాలిపోకుండా సాయపడతాయని పేర్కొంటున్నారు.

ఆకుకూరలు : వీటిల్లో ఐరన్, ఫొలేట్, విటమిన్లు మెండుగా ఉంటాయంటున్నారు నిపుణులు. వీటినీ వారంలో రెండు మూడు సార్లయినా తప్పక తీసుకోవాలని సూచిస్తున్నారు.

మాములుగా అడపాదడపా కురులు రాలిపోతుంటాయి. కానీ, విపరీతంగా జుట్టు రాలిపోతుంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. అందుకే, వీటిని నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. వీటితో పాటు ప్రొటీన్ తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఒత్తిడికి దూరంగా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.