Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

గ్లామర్‌కు గుడ్‌బై ,యాక్షన్ మోడ్‌లో కాజల్ అగర్వాల్ ..

Author Neti Sudiksha | 16 Jun 2026, 12:47 PM | Cinema
గ్లామర్‌కు గుడ్‌బై ,యాక్షన్ మోడ్‌లో కాజల్ అగర్వాల్ ..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కాజల్, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో పూర్తిగా భిన్నమైన పాత్రలపై దృష్టి సారిస్తోంది. గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటూ, కథకు ప్రాధాన్యత ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌ను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ తొలిసారి ఓటీటీ ప్రపంచంలో అడుగుపెట్టబోతోంది. ‘స్వామి రారా’ ఫేమ్ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ‘విశాఖ’ వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
‘విశాఖ’లో కాజల్ పాత్ర ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఒకవైపు సాధారణ గృహిణిగా కనిపించే ఆమె పాత్ర, మరోవైపు అండర్‌వల్డ్ ప్రపంచాన్ని శాసించే లేడీ డాన్‌గా మారడం కథలో కీలక మలుపుగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అమాయకత్వం, ఆవేశం, శక్తివంతమైన నాయకత్వం వంటి విభిన్న భావోద్వేగాలను ఒకే పాత్రలో చూపించే అవకాశం కాజల్‌కు దక్కిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిరీస్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గన్ పట్టుకుని శత్రువులను ఎదుర్కొనే లేడీ డాన్ అవతారంలో కాజల్ కనిపించనున్న సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని సమాచారం. ఇప్పటికే విడుదలైన అంతర్గత ప్రచార సమాచారం ప్రకారం, ఈ సిరీస్‌లో ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు చేయని స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి