Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తెల్ల జుట్టు సమస్యకు కరివేపాకు-మెంతుల చిట్కా

Author Neti Sudiksha | 16 Jun 2026, 01:46 PM | Array
తెల్ల జుట్టు సమస్యకు కరివేపాకు-మెంతుల చిట్కా

ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందికి తెల్ల జుట్టు సమస్య కనిపిస్తోంది. ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం వంటి కారణాల వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతోంది. దీంతో చాలామంది రసాయనాలతో కూడిన హెయిర్ డైలను ఉపయోగిస్తున్నారు. అయితే ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజంగా జుట్టు సంరక్షణ చేసుకోవాలనుకునే వారికి కరివేపాకు, మెంతులు మంచి ఇంటి చిట్కాగా ఉపయోగపడతాయి.కరివేపాకును పురాతన కాలం నుంచే జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరచడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే మెంతుల్లో ఉండే ప్రొటీన్లు, ఖనిజాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.

తయారీ విధానం
ముందుగా ఒక పాన్‌లో గుప్పెడు కరివేపాకు, రెండు చెంచాల మెంతులు వేసి తక్కువ మంటపై వేయించాలి. అవి బాగా వేగి గోధుమ రంగులోకి మారిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత వాటిని మెత్తగా పొడిచేసి నిల్వ చేసుకోవాలి.


ఎలా ఉపయోగించాలి?
తయారు చేసుకున్న కరివేపాకు-మెంతుల పొడిలో అవసరమైనంత కలబంద (అలోవెరా) జెల్ కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సమంగా రాసి 30 నుంచి 45 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఇవి కూడా చదవండి