Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

గిరిజనులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు విస్మరించాయి: జువారి రమేష్

Author Neti Sudiksha | 16 Jun 2026, 04:45 PM | TELANGANA, వరంగల్
గిరిజనులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు విస్మరించాయి: జువారి రమేష్

వరంగల్, జూన్ 16 (సుదీక్ష న్యూస్): వరంగల్‌లోని తమ్మెర భవనంలో తెలంగాణ గిరిజన సమాఖ్య వరంగల్ జిల్లా 3వ మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి జువారి రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే బాషమియా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జువారి రమేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం నిరంతర పోరాటం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ట్రైకార్ రుణాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం గిరిజన సమాఖ్య నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నేతవాత్ బానుచందర్, ప్రధాన కార్యదర్శిగా లావుడ్యా దశ్రునాయక్ ఎన్నికైనట్లు తెలిపారు.