Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నాన్న‌ని త‌ల‌చుకొని వెక్కి వెక్కి ఏడ్చిన‌ ఏవీఎస్ కుమార్తె శాంతి..

Author Neti Sudiksha | 17 Jun 2026, 11:35 AM | Array
 నాన్న‌ని త‌ల‌చుకొని వెక్కి వెక్కి ఏడ్చిన‌ ఏవీఎస్ కుమార్తె శాంతి..

ఫాదర్స్ డే సందర్భంగా ప్రసారంకానున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రత్యేక ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయనుంది. ఈ ఎపిసోడ్‌కు ప్రముఖ హాస్యనటుడు స్వర్గీయ ఏవీఎస్ కుమార్తె శాంతి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆమె ఎమోషనల్ అయిన క్షణాలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఏవీఎస్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తండ్రి ప్రాణాలను కాపాడేందుకు శాంతి తన లివర్‌లో కొంత భాగాన్ని దానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే అనంతరం ఏవీఎస్ మరణించడంతో ఆమె కొంతకాలం ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్లీ సీరియల్స్, టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్‌లో పలువురు ఆర్టిస్టులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సరదా సంభాషణలు, వినోదాత్మక టాస్కులు ప్రేక్షకులను అలరించనున్నాయి. యాంకర్ మానస్ తన తండ్రిని “నాలో నచ్చిన విషయం, నచ్చని విషయం ఏమిటి?” అని అడగగా, ఆయన ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది. అలాగే ఇతర ఆర్టిస్టుల తల్లిదండ్రులు చేసిన కామెంట్లు కూడా ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే కార్యక్రమంలో అసలు భావోద్వేగ ఘట్టం సింగర్స్ ఆలపించిన తండ్రి ప్రేమను గుర్తు చేసే పాటల సమయంలో చోటుచేసుకుంది. ఆ పాటలు వింటూ శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి పాటలు వింటుంటే మా నాన్న మళ్లీ వస్తే బాగుండనిపిస్తోంది అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మాటలు అక్కడున్న వారిని కూడా కదిలించాయి.