Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఉత్కంఠభరిత మ్యాచ్లో ఘానా విజయం- 8ఏళ్ల తర్వాత కొలంబియా గ్రాండ్ రీ ఎంట్రీ

Author Neti Sudiksha | 18 Jun 2026, 11:45 AM | Sports
ఉత్కంఠభరిత మ్యాచ్లో ఘానా విజయం- 8ఏళ్ల తర్వాత కొలంబియా గ్రాండ్ రీ ఎంట్రీ

2026 ఫిఫా వరల్డ్​కప్​లో ఘనా బోణీ కొట్టింది. తాజాగా టొరంటో స్టేడియం వేదికగా పనామాతో జరిగిన మ్యాచ్​లో 1-0 తేడాతో ఘానా జట్టు విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాలేబ్ యిరెంకి చివరి నిమిషంలో గోల్ కొట్టడంతో ఘనా జట్టుకు విజయం ఖరారైంది.

వాస్తవానికి మ్యాచ్ ఆరంభంలోనే పనామా జట్టుకు గోల్ సాధించే అవకాశం వచ్చింది. ఆ జట్టు ఆటగాడు అమీర్ మురిల్లో కొట్టిన షాట్​తో బంతి క్రాస్, ఏరియాలో ఉన్న సెసిలియో వాటర్‌మన్‌కు చేరింది. కానీ ఆ గోల్​ను ప్రత్యర్థి జట్టు ఘానా గోల్​ కీపర్ లారెన్స్ అటి జిగీ ఆ బంతిని సమర్థంగా అడ్డుకున్నాడు. దీంతో పనామా తొలి గోల్ నమోదు చేసే ఛాన్స్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా పనామాకు మరో అవకాశం లభించింది. అటి జిగీ సరిగ్గా పంచ్ చేయని బంతి జియోవనీ రామోస్ కాళ్ల వద్దకు చేరగా, డిఫెండర్‌కు సమయం దొరికినా అతను కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌పైనుంచి వెళ్ళిపోయింది. దీంతో ఫస్టాఫ్​లోనే రెండుసార్లు పనామాకు ఛాన్స్ మిస్ అయ్యింది.