Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

గోల్డెన్ బూట్ రేసు..

Author Neti Sudiksha | 19 Jun 2026, 11:34 AM | క్రీడలు
గోల్డెన్ బూట్ రేసు..

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ 2026 .. ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. మేటి ప్లేయ‌ర్ల త‌మ ట్యాలెంట్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇక అడిడాస్ గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ, డేవిడ్ ఉన్నారు. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టికే టోర్నీలో హ్యాట్రిక్ గోల్స్ కొట్టారు. అత్య‌ధిక గోల్స్ కొట్టిన ప్లేయ‌ర్‌కు గోల్డెన్ బూట్ అవార్డును ప్ర‌జెంట్ చేసే విష‌యం తెలిసిందే. అర్జెంటీనా స్టార్ లియోనిల్ మెస్సీ గ్రూజ్ జేలో అల్జీరియాతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఆరో వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడుతున్న మెస్సీ.. ఇప్ప‌టికే 16 గోల్స్ చేసి.. ఆల్ టైం లీడింగ్‌ స్కోర‌ర్ మిరోస్లేవ్ క్లోస్‌తో స‌మంగా నిలిచాడు.

కోహోస్ట్‌ మెక్సికో ప్లేయ‌ర్ జోనాథ‌న్ డేవిడ్ కూడా హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఖ‌తార్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌ను మూడు గోల్స్ తీశాడు. దీంతో మెస్సి, డేవిడ్‌లు.. గోల్డెన్ బూట్ రేసులో ముందున్నారు. ప్ర‌స్తుతం ఇంకా గ్రూప్ స్టేజ్ ద‌శ‌లోనే వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. మ‌రో వైపు అనేక మంది మేటి ప్లేయ‌ర్లు కూడా గోల్డెన్ బూట్ రేసులో ఉన్నారు. కైలియ‌న్ ఎంబాప్పే, ఎర్లింగ్ హాలాండ్‌, హ్యారీ కేన్ కూడా ఆ రేసులో ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టోర్నీలో 9 మంది ప్లేయ‌ర్లు రెండేసి గోల్స్ చేశారు.
ఒక‌వేళ టోర్నీలో ఇద్ద‌రు లేదా అంత‌క‌న్నా ఎక్కువ మంది ప్లేయ‌ర్లు అత్య‌ధిక స్థాయిలో గోల్స్ చేస్తే, అప్పుడు అసిస్ట్‌ల ఆధారంగా గోల్డెన్ బూట్ విజేత‌ను నిర్ధారిస్తారు. గోల్ స్కోరింగ్ చేసే ప్లేయ‌ర్‌కు ఎంత మంది బంతిని అందిస్తారో దాని ఆధారంగా అసిస్ట్‌ల‌ను ఫిఫా టెక్నిక‌ల్ టీమ్ నిర్ణ‌యిస్తుంది. ఒక‌వేళ అసిస్ట్‌లు కూడా స‌మానంగా ఉంటే, అప్పుడు టోర్నీలో ఆ ప్లేయ‌ర్ ఎన్ని నిమిషాలు ఆడార‌న్న దాని ఆధారంగా విజేత‌ను ప్ర‌క‌టిస్తారు.