Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

స్కూలు నిండినది : ఆ సర్కారు బడుల్లో 'హౌస్​ఫుల్'​ బోర్డులు

Author Neti Sudiksha | 19 Jun 2026, 05:47 PM | TELANGANA
స్కూలు నిండినది : ఆ సర్కారు బడుల్లో 'హౌస్​ఫుల్'​ బోర్డులు

మా పాఠశాలలో ప్రవేశాలు పూర్తయ్యాయి. ఇంకా వెయిటింగ్​లో వందల మంది పిల్లలున్నారు. ఎవరైనా పిల్లలు మానేస్తే చూద్దాం.' సాధారణంగా ఇలాంటి సంభాషణను కార్పొరేట్ స్కూల్స్​లో చూస్తుంటాం. కానీ కొన్ని ప్రభుత్వ బడులు చాలా డిమాండ్​ను ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు వరుస కడుతుండటంతో అందరికీ సమాధానం చెప్పలేక పలు విద్యాసంస్థలు గేట్లకు 'హౌస్​ఫుల్​ బోర్డులు' పెడుతున్నాయి. కార్పొరేట్​ స్థాయి వసతులు, అధునాతనమైన ల్యాబ్​లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉన్న ఆదర్శ పాఠశాలలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

బాలికలకు బస్సు, హాస్టల్ సౌకర్యం : వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గత ఏడాది మొత్తం 905 మంది విద్యార్థులు చదువుకున్నారు. కానీ ప్రస్తుత సంవత్సరం ప్రవేశాల సంఖ్య వెయ్యి దాటింది. ఇందులోని పదవ తరగతిలో మొత్తం ఆరు సెక్షన్లు (ఆంగ్ల మాధ్యమం - 4, తెలుగు - 2) ఏర్పాటయ్యాయి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం హాస్టల్స్​ అందుబాటులో ఉన్నాయి. స్కూల్​ నుంచి అక్కడికి వెళ్లడానికి బస్సు సౌకర్యం ఉంది. బడిలో డిజిటల్​ బోధనా కొనసాగుతోంది. బాలికలకు హస్తకళలు, కరాటే, యోగా, చిత్రలేఖనం, కూచిపూడి నృత్యం వంటివి నేర్పిస్తున్నారు.