Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మౌగ్లీ గర్ల్‌ ఎహసాస్‌ మృతి

Author Neti Sudiksha | 20 Jun 2026, 12:02 PM | జాతీయం
మౌగ్లీ గర్ల్‌ ఎహసాస్‌ మృతి

ఇండియా మౌగ్లీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఎహసాస్‌ (18) కన్నుమూసింది. 2017లో కటార్నియా ఘాట్‌ ఫారెస్ట్‌ ఏరియాలో రోడ్డు పక్కన ఆమె మొదటిసారి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకుంటే ఆ సమయానికి ఆమె మానవులతో సంబంధం లేకుండా జీవిస్తున్నది.లక్నో, జూన్‌ 19: ఇండియా మౌగ్లీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఎహసాస్‌ (18) కన్నుమూసింది. 2017లో కటార్నియా ఘాట్‌ ఫారెస్ట్‌ ఏరియాలో రోడ్డు పక్కన ఆమె మొదటిసారి కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకుంటే ఆ సమయానికి ఆమె మానవులతో సంబంధం లేకుండా జీవిస్తున్నది. రెండు చేతులు, రెండు కాళ్లపై నడిచేది. బట్టలు వేసుకోడానికి ఇష్టపడేది కాదు. మనుషులతో దూకుడుగా ప్రవర్తించేది. దాంతో ఆమెను ది జంగిల్‌ బుక్‌లోని మౌగ్లీ గర్ల్‌తో పోల్చారు. అప్పటి నుంచే ఆమె మౌగ్లీ గర్ల్‌గా ఫేమస్‌ అయింది. ఆమెను మొదట శిశుసంక్షేమ శాఖ అధికారులు తీసుకెళ్లి పూజ అని పేరు పెట్టారు.