Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

బాలయ్య - కొరటాల కాంబోకు ముహూర్తం ఫిక్స్! - గెస్ట్​గా మంత్రి నారా లోకేశ్!

Author Neti Sudiksha | 22 Jun 2026, 12:57 PM | Cinema
బాలయ్య - కొరటాల కాంబోకు ముహూర్తం ఫిక్స్! - గెస్ట్​గా మంత్రి నారా లోకేశ్!

నటసింహం బాలకృష్ణ- స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్​లో 'NBK112' వర్కింగ్ టైటిల్​తో ఓ సినిమా రూపొందనుంది. అయితే మేకర్స్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్​డేట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. జూన్ 25న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందని మేకర్స్ ట్విట్టర్​లో పోస్టు షేర్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ హాజరుకానున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది.
'ఎ పవర్​ఫుల్ కాంబో ఎన్ ఎక్సైటింగ్ బిగినింగ్. జూన్ 25న ఉదయం 9 గంటలకు NBK112 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం జరగనుంది. వెంకటపాలెంలోని TTD శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరంలో జరగనున్న ఈ కార్యక్రమానికి మంత్రులు లోకేశ్, దుర్గేశ్ హాజరుకానున్నారు' అని ఎక్స్​ పోస్టులో రాసుకొచ్చారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.