Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సంక్షోభం – రైతులకు మరణశాసనం రాసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్

Author Neti Sudiksha | 22 Jun 2026, 05:52 PM | వరంగల్
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సంక్షోభం – రైతులకు మరణశాసనం రాసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్

వర్ధన్నపేట, వరంగల్ జిల్లా సుదీక్ష న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి మార్గం నుంచి సంక్షోభాల బాట పట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పంటల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. గతంలో ప్రతి గింజను కొనాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినంత మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని విమర్శించారు. వచ్చే సీజన్ నుంచి రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎరువుల కొరత, విత్తనాల సమస్యలు, విద్యుత్ కోతలు, రైతుబంధు అమలులో నిర్లక్ష్యం, రైతుబీమా నిలిపివేత వంటి చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒక్క కొత్త సంక్షేమ పథకం గానీ, గణనీయమైన అభివృద్ధి కార్యక్రమం గానీ కనిపించలేదన్నారు.

ఇవి కూడా చదవండి

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రతి గ్రామానికి తాగునీరు, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అప్పులు చేసినప్పటికీ ప్రజల సంక్షేమానికి వాటిని వినియోగించడం లేదని విమర్శించారు.

బీఆర్‌ఎస్ కార్యకర్తలను, నాయకులను వేధించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించిన కేటీఆర్, పార్టీ కార్యకర్తల అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లు ప్రత్యేకంగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మరింత తీవ్రంగా పోరాడి, మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంశాలపై కూడా కార్యకర్తలకు వివరించారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.